తొలి చూపులో చిగురించినది ఓ భావం..!
వర్ణన అడిగితే ఏమని చెపుతుంది నా హృదయం..?
తన ఉనికి మధురము మకరందము అయినది అనా?!
మనసులోయన ప్రకంపనాలు పెంచింది అనా?!
తన పిలుపుకి పెదవంచున పదములు జోరులా వెలిగింది అనా?!
అధరముల అంచున మౌనపు హోరులా నిలిచింది అనా?!
తన చూపుకి క్షణం నిలవకుండా ఎగసిపడే హృదయ రాగాల అలలు..
లోకాన్ని జయించి తనకి అంకితం చేయు ఊహలు....
మాటల వారధి లేదు కదా ఇరు హృదయాల నడుమ,
మనసుల సవ్వడి ఒకటే కదా ఇరు జీవితాల నడుమ
ఈ భావానికి పేరు ఏమంటే ..?
నా వద్ద సమాధానం లేదు...
అలాగని ఇది ప్రశ్నా కాదు...
తన అంగీకారంతో పని లేదు..,
ఈ భావములు మాత్రం పదిలం ...
నా జన్మాంతం..!
ఆ జన్మాంతo...!!
దాసు రమ శ్రీ వినీల..
Comments
Post a Comment