అవని ఒడి సహనగుణమున మురిసే రత్నమా..!
అతివ మది సంద్రములోతున మెరిసే ముత్యమా..!!
ఆకాశం అంతా ఇంతే అనే పసిమది నాదా..!
ఆకాశం మీటే ఇంతినే అనే ఎదసడి నాదా..!!
మన్నును ముద్దాడే మిన్ను రూపం పసిడి వర్షమా..!
మిన్నుకై పులకరించు మన్ను రూపం పసిరిక ఆవిర్భావమా..!!
తొలి చినుకుకై తపించే మది నాదా..!
హిమభిందువుకై ఎదురుచూసే హృదయం నాదా..!!
అవని గగన వారధి తనువే ఇంద్రధనుసవా...
ఆ తనువు వింటి సోయాగమా..!
కన్నె కనుపాపల వాందనమా..!!
ప్రకృతి విపoచియై గానము వినిపించేనా..!
ఆ కృతికి విహంగమై ఆకృతి నే పొందేనా..!!
- దాసు రమ శ్రీ వినీల..
Comments
Post a Comment