కవితాఝరి...!!

 



#పరిచయం

సంగీతమా అది మోగుతున్నది..??

సాహిత్యమా అది మురిపిస్తున్నది ..??

ఆత్మీయత ఇది ముద్దడుతున్నది ..!!

అనుబంధమే ఇది ముడివేస్తున్నది..!!


# విరహం 

ఏపని నేను చేస్తూ ఉన్నా తట్టి మురిపిస్తుంది నీ ఊసు..!
ఆగి అరనిమిషం ఊపిరి తీస్తే నిండిపోతుంది నీ ధ్యాస ..!!
ఎంతమంది లోనున్నా తాకుతుంది అనిపిస్తుంది నీ చూపు స్పర్శ..!!!
ఏకాంతాన నీ కౌగిట్లో కరిగిపోవాలని ఉరుకుతుంది నా శ్వాస..!!!




#వేచి చూస్తున్నా
తలపుల తలుపులు తట్టావు కదా...
తెల్లవారకనే తారసపడతావని తపిస్తున్ననిలా..
తొలకరి జల్లులా తడిమేస్తావని తీయగా..
తోనికసలాడుతున్న తరుణి ని తరింపచేయవా...!!




#కలిసిన  ఆ క్షణం

ఈ క్షణమే శాశ్వతమే అయితే చలే..!!
ఈ ఊహే ఉప్పెనలా మారితే మాయే..!!
ఆశలకే ఆనకట్టు వేయటమే యేలే..!!
అలికిడి ఆవనీయక వ్రాయటమీ తీరే..!!


- దాసు రమ శ్రీ వినీల..


Comments

Post a Comment